ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని కంపెనీ చెబుతోంది. అయితే ఇది తప్పని తేలిపోయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్సన్ ఉన్నా వాట్సప్ ని హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. హ్యాక్ చేసి అందరికీ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో అతిపెద్ద లోపం బయటపడటంతో చెక్ పాయింట్ సంస్థ ఆ విషయాన్ని వాట్సప్‌కు తెలిపింది .

వాట్సప్ ని ఏ క్షణమైనా హ్యాక్ చేయవచ్చని, వాట్సప్‌ని హ్యాక్ చేసి మెసేజెస్‌ని మార్చడం ఎంత ఈజీనో ఆధారాలతో సహా చూపిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వాట్సప్‌లో ఛాటింగ్‌ సమయంలో పంపే మెసేజ్‌లను హ్యాకర్లు తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేయడం, మెసేజ్‌ను మార్చడం, అవాస్తవాలను సృష్టించడం, గ్రూప్‌లో కొందరికి మాత్రమే మెసేజ్ చేరేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఈ వీడియోలో తెలిపింది. 

 వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెసేజ్ పంపిన వ్యక్తి, పొందిన వ్యక్తి తప్ప ఇంకెవరూ హ్యాక్ చేసి మెసేజ్‌లు చూడలేనంత భద్రంగా ఉందని వాట్సప్ అనేకసార్లు వెల్లడించింది. కానీ మెసేజ్ వెళ్లకముందే డీక్రిప్ట్ చేసి మెసేజ్‌ను మార్చడం సులువని చెక్‌పాయింట్ బయటపెట్టింది.చెక్‌పాయింట్ వాట్సప్ ఎన్‌క్రిప్షన్ ఆల్గరిథమ్‌ను రివర్స్ ఇంజనీర్ చేసింది.వాట్సప్ మెసేజ్‌ను డీక్రిప్ట్ చేయడం ద్వారా దాన్ని ఎలాగైనా మార్చే యాక్సెస్ లభిస్తుందని రుజువు చేసింది. 

న్యూస్ టెక్నాలజీ వాట్సప్ యాప్స్ హ్యాకింగ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్